ఆధార్ కార్డు గురించి వచ్చిన కొత్త అప్డేట్ గురించి మీకు తెలుసా?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు గాని, రాష్ట్ర ప్రైవేట్ జాబ్ కోసం అప్లికేషన్ చేసుకోవాలన్న ఆధార్ ఎంతో కీలకం. కొన్నిసార్లు ఆధార్ కార్డు లేకపోతే లబ్ధిదారులు ఎలాంటి పథకాలను అందుకోలేరు. ఇకపోతే విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన వారు ఇచ్చే వన్ టైం పాస్ వర్డ్ ఎంతో ముఖ్యం. అయితే ఆధార్ లో ఫోన్ నెంబర్ అప్డేట్ అయ్యుంటే మాత్రమే ఓటిపి పొందగలము. అంటే ఏదైనా మనం అప్లై చేసిన తర్వాత టక్కువ ఓటిపి వచ్చే విధంగా ఉండాలన్నమాట. అయితే ఆధార్ కార్డు అనుసంధానమై ఉన్న ఫోన్ నెంబర్లు మార్చాలన్న అసలు నెంబర్ లేకపోతే కొత్తగా ఏదైనా ఫోన్ నెంబర్ను అనుసంధానం చేయాలనుకున్నా అందుకు ఎటువంటి పత్రం కూడా అవసరం లేదు. అదెలాగో చూడండి, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి సులభంగా ఆధార్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేయవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు ఓటిపి లతో ఆధార్ వివరాలు మార్చేందుకు అనువుగా ఉంటుంది. అయితే మీ ఆధార్ కార్డు లో ఒక వేళ ఫోన్ నెంబర్ అప్డేట్ అయి ఉంటే గనుక ఇంట్లో నుండి ప్రతిదీ అభివృద్ధి అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సేవ కేంద్రం లో ఫోటో బయోమెట్రిక్, ఈమెయిల్ ఐడి వంటివి మార్చాలన్న ఎలాంటి పాత్రలు అవసరం లేదు కేవలం ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే చాలు చాలా సులభంగా ఆ వివరాలను మార్చుకోవచ్చు. ఇక ఆధార్ కార్డు ప్రస్తుతం డెబిట్ కార్డు సైజులో అందిస్తున్నారు. కేవలం యాభై రూపాయలు చెల్లిస్తే చాలు pvc ఆధార్ కార్డు నేరుగా మీ ఇంటి చిరునామా కు వచ్చేస్తుంది.
Comments