రాష్ట్రాలొ డూప్లికేట్ బాబాలు. స్నానం చేసి రమ్మని చెప్పి...
కొద్దిరోజులుగా ఏజెన్సీలో కేటుగాళ్లు మాటు వేసారు. మాయమాటలతో అమాయకులకు వల వేసి బురిడీ కొడుతున్నారు. అందిన దానికి దోచుకునీ పరార్ అవుతున్న. కుక్కునూరు మండల పరిధిలోని దాచవరం గ్రామంలో ఓ మహిళను నమ్మించి ఆమె బంగారు ఆభరణాలను భూత వైద్యులు లూటీ చేసిన ఘటన కలకలం రేపింది. దాచవరం ఎస్సీ కాలనీకి చెందిన ఓ గృహిణి ఇంటి పనుల్లో బిజీగా ఉంది. భర్త పొలం పనికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న మహిళలను గ్రహించి భూతవైద్యుడు ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో లేనిపోని సమస్యలు బాధలు పట్టిపీడిస్తున్నాయని నమ్మించాడు. అవి తొలగిపోవాలంటే ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలని, లేకపోతే మీ ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుందని ఆర్థిక దెబ్బ తింటుందని ఆమెను భయబ్రాంతులకు గురి చేశాడు. ఆమె చేసేది ఏమి లేక ప్రత్యేక పూజలకు ఒప్పుకొని. పూజలు కోసం బంగారు ఆభరణాలు పెట్టాలని కోరాడు. అవి ఊరి చివర పొలం గట్టు మీద పెట్టమని చెప్పాడు. బంగారం ఆభరణాలు పూజ చేసేటప్పుడు కి స్నానం చేసి ఉండమని చెప్పాడు. గంటలు గడుస్తున్నా భూతవైద్యుడు తిరిగి రావడం మోసపోయిన గ్రహించిన బాధితురాలు చుట్టుపక్కల గ్రామస్తులకు సమాచారం అందించింది. స్థానికులతో కలిసి వెతికినా ఒక్క కూడా గేటు గాడి ఆచూకీ కనిపించలేదు. చివరికి చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.
Comments