తరగతుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి...

కరోనా మహమ్మారి తో విద్యారంగం అతలాకుతలమైంది. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డైరెక్ట్ తరగతులు జరగకుండా ఆన్లైన్లోనే క్లాసులు జరుగాయి.అందుకోసం ప్రత్యేకమైన అకాడమిక్ క్యాలెండర్ కూడా తెలంగాణ సర్కార్ సిద్ధం చేసింది.మే 17 నుండి 26 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను ఖరారు చేసింది. కరోనా కారణంగా పదోతరగతిలో ఈసారి 11 పేపర్ బదులు 6 పేపర్లతో ని పరీక్షలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 1 నుండి 9 10 తరగతులకు ప్రత్యక్ష క్లాసులు ప్రారంభం కానున్నాయి.దాంతో పని దినాలు బోధన పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ తో పాటు ఇతర అంశాలతో క్యాలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. దీనిపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. 1 నుండి 8వ తరగతి కి డైరెక్ట్ క్లాసులు కుదరకపోతే ఆన్లైన్ విధానంలో తరగతులను కొనసాగించి విద్యార్థులకు పరీక్ష లేకుండా పై తరగతులకు పంపించే విధంగా అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు మాత్రం ఫిబ్రవరి తర్వాత 6 7 8 తరగతులకు ప్రత్యక్ష బోధనలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts