హైదరాబాద్ శివారులో ఆవుల బీభత్సం...

హైదరాబాద్ శివార్లలో పహాడీ షరీఫ్ లొ ఆవు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పలువురు పై దాడి చేస్తూ పరుగులు తీసింది. ఈ సంఘటనలు ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. కాలినడకన కర్ర సహాయంతో ఖాజా అనే వ్యక్తి ఇంటికి చేరుకున్న సమయంలో లో ఉన్నట్టుండి అతనిపై ఆవు దాడి చేసింది. వృద్ధుని పైకి లేపి కింద పడేసింది. సంఘటన స్థలంలో పడివున్న కాజాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. మరో మున్సిపల్ ఉద్యోగ పై అదే ఆవు దాడి చేయడంతో నడుము విరిగిపోయి హాస్పిటల్ పాలయ్యాడు. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. యువకులు కర్రలతో వెంట పడడంతో ఆవు సమీప కొండ లోకి వెళ్ళిపోయింది. ఆవును బంధించేందుకు రెస్క్యూ టీం ను రంగంలోకి దింపారు. ఆ సిబ్బందిపై కూడా ఆవు దాడి చేయడం తొ వారు కూడా గాయాలు పాలు అయ్యారు. దీంతో పహాడీషరీఫ్ వద్ద స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. జూ పార్క్ సిబ్బందిపై ఆవు దాడి చేయడంతో వారు సైతం గాయాలపాలయ్యారు. చివరకు కలెక్టర్ ఆదేశాల మేరకు జలపల్లి మున్సిపాలిటీ అటవీశాఖ అధికారులు స్థానిక పోలీసులు ఎట్టకేలకు ఆవు ను బంధించారు. ఆతర్వాత జియగూడ గోశాలకు అవును తరలించడంతో అటు అధికారులు ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts