కూతుర్ని చూసి తట్టుకోలేక తల్లి కూడా...

ఆడతనం, ఒకో దేశానికి ఒకో లా ఉండొచ్చు, కానీ అమ్మ తనం మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటుందనేది ఓ తెలుగు సినిమా లో డైలాగ్. నిజమే ఈ ప్రపంచంలో ఏ తల్లి అయినా సరే ఓకే లా ఆలోచిస్తుంది. తన పిల్లల కోసమే పరితపిస్తోంది. తమ పిల్లలు పడే బాధను చూస్తూ భరించడం తల్లి హృదయానికి చాలా కష్టం. వీలైతే పిల్లల కష్టాన్ని తాను భరించడానికి సిద్ధమవుతోంది అమ్మ. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ఇదే విషయాన్ని మరోసారి ఇ ప్రపంచానికి చాటి చెప్పింది. పోర్చుగీస్ కు చెందిన లూసియానా అనే యువతి క్యాన్సర్తో బాధపడుతుంది. దీంతో ట్రీట్మెంట్తో భాగంగా జుట్టు కత్తిరించి వచ్చింది. ఈ పనిని ఆ యువతి తల్లి చేపట్టింది. అయితే ఎంతైనా తల్లి హృదయం కదా? తన ముందు కూతురు అలా మారడం చూసి తట్టుకోలేని ఆ అమ్మ తన జుట్టును కూడా కత్తిరించడం ప్రారంభించింది. తల్లి జుట్టు కత్తిరించి ఉండగా ఆ కూతురు బాధతో కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది కూతురు కష్టంలో తన భాగస్వామి అవుతూ తళ్లి చేసిన పనికి నెటిజన్లు భగొద్వానికి గురవుతున్నారు. ఈ సృష్టిలో మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది మీ కూతురు ఏమీ కాదులే అమ్మా అంటూ ఆ తల్లికి భరోసా ఇస్తున్నారు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

best cricket jersey designs and other sportswear manufacturing company?