RTC బస్సు రన్నింగ్ లొ ఉండగా వెనుక చక్రం మొత్తం సెట్ తో ఉడి పోయి....
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అటు దిగువ గ్రామాలు పట్టణాలు కాకుండా ఇటు ప్రధాన రహదారులు గుంతలు గోతులతో ద్వంసం అయింది. దిని వలన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఒక RTC బస్సు ఈ యొక్క వెనుక చక్రాలు మొత్తం సెట్ తో పాటు నడి రోడ్డుమీద ఊడిపోయాయి. ప్రయాణికులు డ్రైవర్ కి గాయాలు కాకుండా డ్రైవర్ చాకచక్యంగా బస్సు నియంత్రించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు డిపో బస్సు రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్డు ధ్వంసమయ్యాయి. స్థానికులు అతిత్వరగా ఈ రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు లేకపోయినట్లయితే ఇటువంటి ప్రమాదాలు ఇంకా ఎన్ని చూడాలో అని భయం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు



Comments