రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన డాక్టర్లు.ఆయన ఆరోగ్యం ఎప్పుడు...


                   ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వెల్లడించలేదు. కరోనా కారణంగా రాజశేఖర్ తమ ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్న సిటీ న్యూరో సెంటర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని వెంటిలేటర్ సపోర్టు అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ రత్న కిషోర్ పేర్కొన్నారు.ఆస్పత్రి నుంచి ప్రకటన వెలువడక ముందు ఆయన చిన్న కుమార్తె శివాత్మిక సామాజిక మాధ్యమాల్లో ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రకటన చేసింది. కరోనా నుంచి కోలుకునేందుకు నాన్న తీవ్రంగా పోరాటం చేస్తున్నారని పేర్కొంది. కరోనా నుంచి నాన్న వేగంగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థన చేయాలని కోరింది. శివత్మిక ప్రకటనలతో రాజశేఖర్ ఆరోగ్యం పై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మరోమారు తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని పేర్కొంటూ రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.సినీ నటుడు రాజశేఖర్  కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. తన తండ్రి ఆరోగ్యం పై శివాత్మిక పోస్ట్ చేసిన ట్వీట్ చూసి స్పందించిన చిరంజీవి స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు.  శివాత్మిక కు ధైర్యం చెబుతూ ట్వీట్ చేసిన చిరంజీవి రాజశేఖర్ కుటుంబం దైర్యంగా ఉండాలని సూచించారు

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

best cricket jersey designs and other sportswear manufacturing company?