తెల్లవారు చాలు వారి ఇంటికి వందలాది అతిథులు... అతిథులు ఎవరో తెలుసుకోండి...

 

విశాఖలో ఇంటికి రోజూ వందల సంఖ్యలో అతిథులు వస్తుంటారు.వచ్చిన వారికి కడుపు నిండా తిండి పెడతారు ఆ ఇంటి యజమాని.ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్లుగా చేస్తున్నారు. ఎంత మంది అతిథులు వచ్చినా  లేదనకుండా పెట్టడం వారికి అలవాటు. అసలు ఒకే ఇంటికి ఇంత మంది అతిథులు ఏళ్ళతరబడి రావడానికి కారణం ఏమిటి,విశాఖలో లక్ష్మీ నారాయణ రెడ్డికి పక్షి ప్రేమికుడు గా మంచి పేరు ఉంది.15 ఏళ్లుగా ఆయన కుటుంబం ఆహారం అందిస్తూ వస్తోంది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కొన్ని వందల రామచిలుకల లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటిపై వాలిపోతాయి. మూడు పూటలా వాటి గింజలు జల్లుతూతుంటారు. కుటుంబ  సభ్యులు ఆహారం అలవాట్లు మారిన పక్షులకు గింజలు వేసే విషయంలో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవు. వందలాది పక్షులు ఏళ్లతరబడి లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటి సభ్యులు గా మారిపోయాయి. ఈ మొత్తం వీటికి ఆహారం అందిస్తూ అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా వచ్చే రామచిలుకలు పావురాలు చూసేందుకు చుట్టు పక్కల ఇళ్లల్లో ఉన్నవారు, బిల్డింగ్ పైకి వచ్చి ఉంటారు. వారికి పక్షుల పలకరింపులు లేనిదీ సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉండవు.   స్థానికులకు పక్షుల రాకపోకలు ఏ సమయానికి గుర్తు చేస్తూ ఉంటాయి. వందలాది పక్షులు బిల్డింగ్ పైకి చేరుకుంటాయి. వీటిని చూడకుండా ఇరుగు పొరుగువారు ముచ్చటపడి రోజంటూ ఉండదు.మానసిక ప్రశాంతత ఈ పక్షుల చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్థానికులు. వీరికి రామచిలుకలు పావురాలతో పదిహేనేళ్లుగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది. మొదట్లో ఒకటి రెండు చిలుకలు మాత్రమే వచ్చేవి తరువాత గుంపులుగా రావడం మొదలుపెట్టాయి. ఎన్ని పక్షులు వచ్చినా వాటికి ఆహారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు లక్ష్మీ నారాయణ రెడ్డి.  మొత్తానికి విశాఖలో పక్షి ప్రేమికుడు లక్ష్మీనారాయణ రెడ్డిని స్థానికులు అభినందన లో ముంచెత్తుతున్నారు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts