భర్త గోవాలొ,భార్య హైదరాబాద్లో ఉండి...

 


భార్యాభర్తలు కలిసి ఉద్యోగాలు చేసుకోవడం చూసాం, వ్యాపారాలు చేయడం ఇప్పుడు వరకు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఉద్యోగాలు వ్యాపారాలు రొటీన్ అనుకున్నారేమో హైదరాబాద్కు చెందిన దంపతులు వెరైటీ గా ఆలోచించారు.అతి తెలివి తేటలు చూపి అపారంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేస్తారు. ఐపీఎల్ సీజన్ లో ఆ ప్రణాళిక అమలు చేసే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారానికి వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ తెరదించారు. ఎందుకంటే దంపతులు చేస్తోంది IPL బెట్టింగ్. ఒకరేమో ఆఫీసులో ఉంటే ఒకరేమో ఫీల్డ్ లో వుండి బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో దంపతులిద్దరికీ కూడా అదుపులోకి తీసుకున్నారు,వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. భర్త గోవాలో ఉండి బెట్టింగ్ నడుపుతుండగా భార్య హైదరాబాద్లో ఉండి డబ్బులు వసూలు చేస్తోంది.ఇద్దరు భార్యాభర్తలు కలిసి కోపరేషన్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ విధంగా బట్టి వ్యవహారాన్ని నడిపించడం పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.నగరానికి చెందిన రాహుల్ అతని భార్య సుమలత ఐపీఎల్ బెట్టింగ్ సాగిస్తున్నారు. పోలీసుల భయంతో రాహుల్ గోవా ఉండే బెట్టింగ్ వ్యవహారాలు నిర్వహిస్తుంటే,పాల్గొన్న వారి దగ్గర నుంచి అతని భార్య సుమలత హైదరాబాద్ లో డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భార్యాభర్తలిద్దరూ అరెస్టు చేశారు.ఉన్నత ఉద్యోగం చేస్తున్నానని రాహుల్ కుటుంబాన్ని నమ్మించి బెట్టింగ్ చేస్తున్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts