కూతురు పెళ్ళి కోసం 500 కోట్ల రూపాయలు అప్పు చేసి దివాళా తీశాడు...


                         కాలం చాలా విచిత్రమైనది ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రమోద్ మిట్టల్ విషయంలో ఇది మరోసారి రుజువయ్యింది.ప్రపంచ కుబేరుల్లో ఒకరైనా లక్ష్మీ మిట్టల్ కు స్వయానా సోదరుడు ప్రమోద్ మిట్టల్. లండన్కు చెందిన వ్యాపారవేత్త వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారు.సుమారు 24 వేల కోట్ల రూపాయలు అప్పు నటులని హైకోర్టుకు తెలిపారు ప్రమోద్.దీంతో బ్రిటన్ చరిత్రలోనే ఇది అతి పెద్దది దివాళి కేసు గా అధికారులు గుర్తించారు. ప్రమోద్ మిట్టల్ పతనానికి కారణం బోస్నియన్ కు చెందిన ఓ బొగ్గు కంపెనీ.2006 లొ బోస్నియన్ కోక్  తయారీ కంపెనీ జికెల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ తరఫున హామీ సంతకం పెట్టారు మిట్టల్. అయితే 166 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించడంలో జిగేల్ విఫలమయింది. దీంతో అప్పు ఇచ్చిన మార్కెటింగ్ కంపెనీ ఆ మొత్తాన్ని ప్రమోద్ మిట్టల్ నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో అంత మొత్తాన్ని తన చెల్లించ లేనట్టు ప్రకటించారు మెటల్. తనకే వ్యక్తిగత ఆదాయం లేదని గత ఏడాది లండన్ కోర్టులో చెప్పారు ప్రమోద్ మిట్టల్.తన భార్యకు ఆర్థిక స్వేచ్ఛ ఉందని తమకు వేర్వేరు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు.అందువల్ల ఆమె ఆదాయం గురించి తనకు చాలా తక్కువ తెలుసు అని అన్నారు,ప్రమోద్ మిట్టల.  రెండు వేల నుండి మూడు వేల పౌండ్ల తన నెలవారీ ఖర్చులు కూడా భార్య కుటుంబ సభ్యులే భావిస్తున్నట్లు వివరించారు. దివాలా కేసులో కోర్టు ఖర్చులు మూడవ పక్షం భరిస్తుందని కోర్టుకు తెలిపారు.అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు ప్రమోద్ మిట్టల్.ఈ క్రమంలో 2019లో బోస్నియా లో అతన్ని అరెస్టు చేశారు.అలాగే భారత్లోనూ 2,200 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారు ప్రమోద్ మిట్టల్.ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను మోసం చేసినందుకు 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే ఈ మొత్తాన్ని సోదరుడు లక్ష్మీ మిట్టల్ చెల్లించడంతో కేసు నుంచి బయటపడ్డారు ప్రమోద్.అనిల్ అంబానీ కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల తన ఆర్థిక పరిస్థితి పై లండన్ కోర్టుకు వివరించారు.ఖర్చులు తగ్గించుకొన్నట్టు తెలిపారు అనిల్ అంబానీ.అంతేకాదు ఓ కేసులో అనిల్ అరెస్టు కాకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని చెల్లించి ముఖేష్ అంబానీ. అంబానీ కుటుంబం లాగే 1994లో మీటర్ సోదరులు విడిపోయారు.లక్ష్మీ మెటల్ ఆర్సెలర్ మిట్టల్ గా పని కొనసాగించాడు. నేడు ఈ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ మేకర్ గా ఉన్నారాయన. ప్రమోద్ మిట్టల్ సంస్థ గ్లోబల్ స్టీల్ హోల్డింగ్స్ దివాళా తీసింది. 2013లో తన కుమార్తె సృష్టి పెళ్లి కోసం 50 మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ప్రమోద్. అప్పట్లో ఆ పెళ్లి వేడుక గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు జనం. అలాంటి ప్రమోద్ మిట్టల్ ఇప్పుడు దివాలా తీసి అప్పుల ఊబిలో కూరుకుపోవడం చూసి అయ్యా అంటున్నారు పబ్లిక్.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts